తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమల బ్రహ్మోత్సవాలు: అశ్వవాహనంలో విహరించిన కల్కి భగవానుడు - venkatachalapathi darshan news today

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు శనివారం రాత్రి మహత్తరమైన అశ్వవాహనంపై స్వామివారు కొలువుదీరి కనులవిందు చేశారు. బ్రహ్మోత్సవాల్లో చివరగా నిర్వహించిన ఈ వాహనసేవలో.. శ్రీవారు కల్కి అవతారంలో అశ్వరూఢుడై భక్తులకు దర్శనమిచ్చారు.

Bhramotsavalu last day ashwa vahana seva latest News
తిరుమల బ్రహ్మోత్సవాలు: అశ్వవాహనంలో విహరించిన కల్కి భగవానుడు

By

Published : Sep 26, 2020, 10:46 PM IST

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఎనిమిదో రోజు రాత్రి మహత్తరమైన అశ్వవాహనంపై స్వామివారు కొలువుదీరి కనువిందు చేశారు. బ్రహ్మోత్సవాల్లో చివరగా నిర్వహించే ఈ వాహనసేవలో.. శ్రీవారు కల్కి అవతారంలో అశ్వరూఢుడై భక్తులకు దర్శనమిచ్చారు.

క్షత్రియ లక్షణాలతో వెంకటాచలపతి..

క్షీరసాగర మథనం సమయంలో ఆవిర్భవించి దేవేంద్రుని ఆధీనంలో ఉన్న ఈ అశ్వవాహనంపై తలపాగా, దూసిన కరవాలం, విశేష తిరు ఆభరణాలను ధరించి.. క్షత్రియ లక్షణాలతో భక్తులకు స్వామివారు అభయప్రదానం చేశారు. ఆదివారం ఉదయం నిర్వహించే చక్రస్నానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఇదీ చూడండి:సర్కారు ఖజానా నింపుకునేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌: అఖిలపక్షం

ABOUT THE AUTHOR

...view details