తెలంగాణ

telangana

ETV Bharat / state

TTD EO: తిరుమల నడక దారిలో అభివృద్ధి పనులు.. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి..!

తిరుమలలోని భక్తుల వసతి సముదాయం-4 వద్ద ఉన్న కామన్‌ కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్‌ను తితిదే ఈవో జవహర్​ రెడ్డి పరిశీలించారు. అనంతరం నడక దారిలోని ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యం వద్ద జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించిన ఆయన.. అభివృద్ధి ప‌నుల్లో మ‌రింత నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఇంజినీరింగ్ అధికారుల‌కు సూచించారు.

ttd eo Jawahar Reddy
తితిదే ఈవో జవహర్​ రెడ్డి

By

Published : Jul 14, 2021, 11:40 AM IST

తిరుమల(tirumala)లో అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందించిన‌ట్లు... తితిదే ఈఓ( ttd eo) జ‌వ‌హ‌ర్‌ రెడ్డి(jawahar reddy) తెలిపారు. తిరుమలలోని భక్తుల వసతి సముదాయం-4 వద్ద ఉన్న కామన్‌ కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్‌(common command control centre)ను ఆయన ప‌రిశీలించారు. తిరుమ‌ల‌లో భ‌ద్రతా, నిఘా వ్యవ‌స్థలు పటిష్టంగా ఉన్నాయన్నారు. ఇజ్రాయ‌ల్ టెక్నాల‌జీతో కూడిన భ‌ద్రతా వ్యవ‌స్థను ఏర్పాటు చేసేందుకు గ‌ల అవ‌కాశాల‌ను.. ప‌రిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

నేర రహిత పుణ్యక్షేత్రం

తిరుమ‌ల‌ను నేర ర‌హిత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్ధేందుకు.. తితిదే భ‌ద్రతా సిబ్బంది అంకిత భావంతో ప‌నిచేస్తోందన్నారు. మ‌రిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. కామన్‌ కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి.. మరింత పటిష్టమైన భద్రత వ్యవస్థను ఏర్పాటు చేయాలని తితిదే నిఘా, భద్రతా ముఖ్య అధికారి గోపీనాథ్‌జెట్టికి సూచించారు.

తిరుమ‌ల‌లో ఇప్పటివరకు 1,654 సీసీ కెమ‌రాలు ఉన్నాయ‌ని, వీటిలో 1,530 కెమెరాలను కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్‌కు అనుసంధానించిన‌ట్లు.. అధికారులు ఈఓకు వివరించారు. అనంతరం న‌డ‌క‌దారిలోని ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యం వద్ద జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించారు. అభివృద్ధి ప‌నుల్లో మ‌రింత నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఇంజినీరింగ్ అధికారుల‌కు సూచించారు. అక్టోబ‌ర్​లో జరగనున్న బ్రహ్మోత్సవాల నాటికి ప‌నులు పూర్తి చేయాల‌ని వారిని ఆదేశించారు.

ఇదీ చదవండి:TTD: 'తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు తిరస్కరించలేదు'

ABOUT THE AUTHOR

...view details