తెలంగాణ

telangana

ETV Bharat / state

Tiger Offspring: అభయారణ్యాల్లో పులి కూనలు... ఏడాదిలోనే ఎనిమిది జననం - రాష్ట్రంలో పెరిగిన పులుల సంఖ్య

జాతీయ జంతువు పులి.. రాష్ట్రంలో తన బలగాన్ని పెంచుకుంటోంది. గతంలో అంతరించుకుపోయే దశకు చేరుకున్న పులులు ఇప్పుడు గణనీయంగా సంతతిని పెంచుతున్నాయి. పులి కూనలు పుట్టిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

Tiger Offspring
అభయారణ్యాల్లో పులి కూనలు

By

Published : Jul 16, 2021, 7:04 AM IST

రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పులుల సంతతి (Tiger Offspring) గణనీయంగా పెరుగుతోంది. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు (Amrabad Tiger Reserve ఏటీఆర్‌)లో దాదాపు ఆరు, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ (kawal tiger reserve కేటీఆర్‌) కారిడార్‌ ప్రాంతంలో రెండు.. మొత్తం ఎనిమిది కూనలు సంచరిస్తున్నాయి. వీటి వయసు రెండు నెలల నుంచి ఏడాదిలోపే. ఒక సంవత్సరంలో ఇన్ని పులి కూనలు జన్మించడం చాలా ఏళ్ల తరువాత ఇదే తొలిసారని అటవీ అధికారులు చెబుతున్నారు.

కుమురం భీం జిల్లా పరిధిలోని కడంబ అటవీ ప్రాంతంలో ఫాల్గుణ పెద్దపులి (Falguna tiger) రెండు విడతల్లో ఎనిమిది కూనలకు జన్మనిచ్చింది. అవన్నీ పెరిగి పెద్దవై వేర్వేరు ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. అమ్రాబాద్‌ జిల్లాలోని ఫర్హాబాద్‌ వ్యూపాయింట్‌ ప్రాంతంలో సంచరించే ‘ఫర్హా’ ఆడ పులి గతంలో రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అవి కొల్లాపూర్‌, లింగాల ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. ఆ పులి తాజాగా 3-4 కూనలకు జన్మనిచ్చిందని, వీటి వయసు రెండు నెలల లోపేనని కెమెరాల ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. నల్లమల్ల అడవుల్లోనే మరో ఆడపులికి 2-3 పిల్లలు పుట్టాయి. పులి కూనలు పుట్టిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోకి వచ్చే అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు పరిధిలో ప్రస్తుతం 18-20 పెద్దపులులు ఉన్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో స్థిరపడ్డవి, మహారాష్ట్ర నుంచి ఈ జిల్లాల్లోని అటవీ ప్రాంతాలకు వచ్చిపోతున్నవి కలిపి 8-12 వరకు ఉన్నట్లు అంచనా.

ABOUT THE AUTHOR

...view details