తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రత్యేక రైళ్లకు టికెట్​ రిజర్వేషన్లు షురూ... - టికెట్​ రిజర్వేషన్లు ప్రారంభం

లాక్​డౌన్​ నేపథ్యంలో నడుపుతున్న ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్లు కల్పించడానికి రెగ్యులర్ బుకింగ్ కౌంటర్లను తెరవాలని భారత రైల్వే శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులందరికీ దశలవారీగా అన్ని ప్రధాన స్టేషన్లలో రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్లను ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి 73 స్టేషన్లలో రిజర్వేషన్​లు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

south central railway latest news
south central railway latest news

By

Published : May 22, 2020, 11:09 AM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లు ప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 18 స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వికారాబాద్, తాండూర్, కాజిపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ, కామారెడ్డి, నిజామాబాద్, రామన్నపేట, మహబూబ్​నగర్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 44 స్టేషన్లలో కౌంటర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, రేణిగుంట, కర్నూలు, పిడుగురాళ్ల, నంబూర్, మంగళగిరి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, కృష్ణ కెనాల్, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తాడేపల్లిగూడెం, అనపర్తి, పిఠాపురం, అన్నవరం, కొండపల్లి, చిత్తూరు, కొడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, కడప, కమలాపురం, యెర్రగుంట్ల, ముద్దనూరు, కొండపురం, తాడిపత్రి, గుంతకల్, అనంతపురం, ధర్మవరంతోపాటు తదితర ప్రాంతాలు.

రిజర్వేషన్​ టికెట్​ కౌంటర్లు అందుబాటులో ఉండే స్టేషన్లు...

మహారాష్ట్ర... నాందేడ్, పూర్ణ, పర్భని, సేలు, జల్నా, ఔరంగాబాద్​

కర్ణాటక... సెదమ్, రాయచూర్, సైదాపూర్, నల్వార్, యాద్గిర్

రిజర్వేషన్​ టికెట్​ కౌంటర్ల వద్ద టికెట్ బుక్ చేసుకోవడానికి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్​ ధరించటంతోపాటు భౌతిక దూర నిబంధనలు పాటించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details