Thummala Nageswara Rao To Join Congress : ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో(Khammam Polotics) తన ముద్ర వేసి, రాజకీయ దిగ్గజంగా పేరుగాంచిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదుపరి రాజకీయ అడుగులు కాంగ్రెస్ వైపేనన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని తుమ్మల నివాసం వేదికగా అనూహ్యంగా సాగిన రాజకీయ పరిణామం ఉమ్మడి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి తుమ్మలతో ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ కావడం, ఆయన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి.
Thummala To Join Congress :ఈ సందర్భంగా తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించగా.. ఇందుకు ఆయన సానుకూలంగానే స్పందించినట్లు తెలిసింది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు.. గురువారం మధ్యాహ్నం వరకు తుమ్మల(Thummala Joins Congress) ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు. ఉదయం పాలేరు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో గండుగులపల్లి నుంచి బయలుదేరి ఖమ్మం చేరుకున్నారు. ఇక్కడి నుంచి నేరుగా హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. సాయంత్రం ఆరుగంటల సమయంలో తుమ్మల నివాసానికి చేరుకున్న రేవంత్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు.
Thummala Congress Latest News :నేతల మధ్య సమావేశం సుహుద్భావ వాతావరణంలో సాగడంతో తుమ్మల తదుపరి అడుగులు కాంగ్రెస్ వైపేనన్న ప్రచారం ఊపందుకుంది.తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) అభివర్ణించారు. ఏఐసీసీ జిల్లా ముఖ్య నాయకుల అనుమతితోనే తుమ్మలను కలిసినట్లు వివరించారు. సహచరులను, అభిమానులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్న రేవంత్. కేసీఆర్ను తరిమికొట్టడానికి అందరం ఏకమవుతున్నామని తెలిపారు. చర్చలు సానూకుల ఫలితానిస్తాయని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి తెలిపారు.
" నేను.. రేవంత్ రెడ్డి, సుదర్శన్ ఇంకొంత మంది.. తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వారితో చర్చలు జరిపే ముందే కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చాం. వారు కాంగ్రెస్‌లోకి వస్తే ఎలాంటి మార్పులు, లాభాలు ఉంటాయో చర్చించాం. వాళ్ల కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయానికి వస్తామని ఆయన చెప్పారు." - మల్లు రవి, పీసీసీ ఉపాధ్యక్షుడు