Janasena chief Pawan Kalyan: హైదరాబాద్‌లోని పవన్ ఇంటి వద్ద రెక్కీ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ, దాడి కుట్ర ఏమీ జరగలేదన్న పోలీసులు తెలిపారు. నిందితులను ఆదిత్య విజయ్, వినోద్, సాయికృష్ణగా పోలీసులు గుర్తించారు.
పవన్‌కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ.. దాడి కుట్రపై పోలీసుల క్లారిటీ - జనసేన అధినేత
Janasena chief Pawan Kalyan: హైదరాబాద్‌లోని పవన్ ఇంటి వద్ద రెక్కీ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ, దాడి కుట్ర ఏమీ జరగలేదన్న పోలీసులు తెలిపారు. నిందితులను ఆదిత్య విజయ్, వినోద్, సాయికృష్ణగా పోలీసులు గుర్తించారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్
పబ్‌లో మద్యం తాగి వస్తూ పవన్ ఇంటివద్ద యువకులు కారు ఆపారు. కారు తీయాలని అడిగిన పవన్ సెక్యూరిటీతో ఆ ముగ్గురు యువకులు గొడవకు దిగారు. తాగిన మైకంలోనే పవన్ ఇంటివద్ద గొడవ పడినట్లు వారు ఒప్పుకున్నారు. పవన్ ఇంటివద్ద ఆపిన గుజరాత్ రిజిస్ట్రేషన్ కారు సాయికృష్ణదని వెల్లడించారు. అయితే పోలీసుల వివరణపై జనసేన నేతలు ఇంకా స్పందించాల్సి ఉంది.
ఇవీ చదవండి:
Last Updated : Nov 4, 2022, 7:19 PM IST