తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు జడ్జిల నియామకం - తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు జడ్జిల నియామకం

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు రానున్నారు. జస్టిస్​ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి, జస్టిస్​ కూనూరు లక్ష్మణ్‌, జస్టిస్​ తడకమళ్ల వినోద్‌కుమార్​లను జడ్జిలుగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నియమించారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు జడ్జిల నియామకం

By

Published : Aug 23, 2019, 10:58 PM IST

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ న్యాయవాదులు తడకమళ్ల వినోద్ కుమార్, అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి, కూనూరు లక్ష్మణ్ నియమితులయ్యారు. ముగ్గురినీ న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన అనతరం... రాష్ట్రపతి నియమాక నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టులో జడ్జిల సంఖ్య ప్రధాన న్యాయమూర్తితో కలిపి 14కి చేరింది.

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు జడ్జిల నియామకం
ఇదీ చూండండి: గుండాల సాక్ష్యులకు రక్షణ కల్పించండి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details