Three Died in Hyderabad Ganesh Nimajjanam :హైదరాబాద్‌లో జరుగుతున్నగణేశ్ నిమజ్జన వేడుక(Ganesh Immersion 2023)ల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. సంజీవయ్య పార్క్ వద్ద ప్రమాదవశాత్తు వాహనం కిందపడి బాలుడు మృతి చెందాడు. మృతి చెందిన బాలుడు కిషన్‌బాగ్ చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.
Hyderabad Ganesh Nimajjanam Accidents :అలాగే బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వద్ద వాహనం కిందపడి నాలుగేళ్ల బాలుడు మరణించాడు. బెల్లంపల్లికి చెందిన రాజశేఖర్ కుటుంబం నగరంలోని సంతోశ్ నగర్ ప్రెస్ కాలనీలో నివాసం ఉంటుంది. గణేశ్ నిమజ్జనం కోసం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. బషీర్‌బాగ్ వద్ద బైకు అదుపు తప్పడంతో వారంతా కిందపడ్డారు. నాలుగేళ్ల బాలుడి పైనుంచి మరో వాహనం వెళ్లింది. తీవ్రగాయాలైన బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
Hyderabad Ganesh Tragedy :మరోవైపు రంగారెడ్డి జిల్లాలో కూడా వినాయక నిమజ్జన వేడుక(Ganesh Visarjan Tragedy Telangana)ల్లో అపశ్రుతి జరిగింది. ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో జరిగింది. మృతునిది చెర్లపటేల్‌గూడ గ్రామంగా గుర్తించారు. మహబూబాబాద్‌లో గురువారం వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనంలో విద్యుదాఘాతంతో యువకుడు మహేశ్ మృతి చెందాడు. అలాగే జగిత్యాల జిల్లాలో గణేశ్ శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. యువకుడిపై కత్తితో దాడి చేసిన వ్యక్తులు.. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.