అల్పపీడన ద్రోణి బలహీనపడి దక్షిణ ఝార్ఖండ్ పరిసర ప్రాంతాలలో కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు... ఇవాళ పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
RAINS: అల్పపీడన ప్రభావం.. పలుచోట్ల భారీ వర్షాలకు అవకాశం.! - రాబోయే మూడు రోజులు
అల్పపీడన ద్రోణి బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా రాష్ట్రం వైపు ఉందని... అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని ఐఎండీ సంచాలకులు వెల్లడించారు. ఈ ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని ఒకట్రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మరోమూడు రోజుల పాటు వర్షాలు
అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫియర్ స్థాయి వరకు వ్యాపించిందని వాతావరణశాఖ తెలిపింది. ఎత్తుకు వెళ్లే కొద్దీ అల్పపీడనం నుంచి నైరుతి దిశగా తెలంగాణ వైపు ఉందని... ఇది అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వివరించింది.
ఇదీ చూడండి:Etela: హుజూరాబాద్‌లో వంద శాతం పోటీ చేస్తా.. గెలుస్తా..