బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రమైంది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా కాగజ్‌నగర్(కుమురం భీం జిల్లా)లో 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
WEATHER REPORT: రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రం కావడమే ఇందుకు కారణమని పేర్కొంది.
WEATHER REPORT: రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు