తెలంగాణ

telangana

ETV Bharat / state

Assembly Pause: మూడు రోజులు శాసనసభ, మండలి సమావేశాలకు విరామం - Telangana assembly sessions break

గులాబ్ తుపాను (Gulab Cyclone) ఎఫెక్ట్ శాసనసభ, మండలి సమావేశాలపై పడింది. సమావేశాలకు మూడురోజులు పాటు శాసనసభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ విరామం (Assembly Pause) ప్రకటించారు. అనంతరం వచ్చేనెల 1న తిరిగి సమావేశం కానున్నాయి.

Assembly
Assembly

By

Published : Sep 28, 2021, 5:04 AM IST

గులాబ్ తుపాను (Gulab Cyclone), భారీవర్షాల వల్ల వర్షాకాల సమావేశాలకు మూడు రోజులపాటు విరామం (Assembly Pause) ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో సమావేశాలను వాయిదా వేసి తర్వాత నిర్వహించాలని శాసనసభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్‌కు పలువురు సభ్యులు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడంతో సహా... ప్రజలు ఎదురయ్యే ఇబ్బందులు పరిష్కరించాల్సి ఉందని కోరారు.

సభ్యుల విజ్ఞప్తిమేరకు సభా నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Cm Kcr)తో పాటు ఆయాపక్షాల నేతలను సంప్రదించిన సభాపతి, ప్రొటెం ఛైర్మన్ వారి ప్రతిపాదనను ఆమోదించారు. మూడురోజులపాటు వాయిదావేయాలని నిర్ణయించారు.ఉభయసభలు వచ్చేనెల 1వ తేదీ ఉదయం పది గంటలకు సమావేశం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు బులెటిన్ జారీ చేశారు. సభ్యులందరికీ సమాచారం పంపారు.

నీట మునిగిన హైదరాబాద్​

గులాబ్‌ తుపాన్ (Gulab Cyclone) ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు (Hyderabad rains) కురుస్తున్నాయి. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతి నగర్‌, బోరబండ, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఈఎస్‌ఐ, అమీర్‌పేట, రహమత్ నగర్‌, యూసఫ్‌గూడ శ్రీకృష్ణ నగర్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. శ్రీకృష్ణనగర్‌ రహదారిపై నడుములోతు వరద నీరు వచ్చి చేరింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో కుండపోత వాన పడుతోంది. మాదాపూర్‌లో రహదారులు చెరువును తలపిస్తున్నాయి. జూబ్లీహిల్స్-హైటెక్‌సిటీ మార్గంలో 2 కి.మీ వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్‌ సీవోడీ వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జూబ్లీహిల్స్ నుంచి వచ్చే వాహనాలను కేబుల్‌ బ్రిడ్జ్‌ మీదుగా మళ్లిస్తున్నారు. మాదాపూర్‌ అమర్‌ సొసైటీ, నెక్టార్‌ గార్డెన్‌ కాలనీల్లో భారీగా వరద వచ్చింది.

ఇదీ చూడండి:Gulab Cyclone effects on Hyderabad : రెండు గంటల వర్షం... నీట మునిగిన భాగ్యనగరం

ABOUT THE AUTHOR

...view details