మూడు రోజులు శాసనసభ, మండలి సమావేశాలకు విరామం - Telangana news 2021
22:40 September 27
మూడు రోజులు శాసనసభ, మండలి సమావేశాలకు విరామం
మూడు రోజులు శాసనసభ, మండలి సమావేశాలకు విరామం ప్రకటించారు. తిరిగి అక్టోబర్ 1న ఉభయసభలు సమావేశం కానున్నాయి. గులాబ్ తుపాను, భారీ వర్షాల దృష్ట్యా సమావేశాలకు విరామం ప్రకటించారు. అధికారులు, ఎమ్మెల్యేలు సహాయచర్యల్లో పాల్గొనాల్సినందున నిర్ణయం తీసుకున్నారు. వర్షాకాల సమావేశాలపై సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రొటెం ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. సభా నాయకుడు, ఆయా పక్షనేతలు, సభ్యుల విజ్ఞప్తి మేరకు సమావేశాలకు విరామం ప్రకటించారు.
ఇదీ చూడండి:Harish Rao on dalit Bandu: రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి దళితబంధు ఇస్తాం...