తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్పత్రి ఆవరణలో మూడు రోజుల పసికందు! - అనంతపురంలో పసికందును ఆటోలో వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తులు

మూడు రోజుల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రి ఆవరణలో వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే సిబ్బంది ఆ పాపను వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. నెలలు నిండకుండానే పాప జన్మించినట్లు వైద్యులు గుర్తించారు. బిడ్డకు ఆరోగ్య సమస్యలు ఉండటం వల్లే కుటుంబసభ్యులు వదిలి వెళ్లిఉంటారని వైద్యులు భావిస్తున్నారు. ఈ అమానవీయ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కదిరిలో చోటు చేసుకుంది.

three-day-old-baby-was-left-on-the-hospital-premises-in-ananthapuram-district
మూడు రోజుల పసికందును... ఆస్పత్రి ఆవరణలో ఆటోలో వదిలేశారు

By

Published : Nov 19, 2020, 1:54 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో ఆపి ఉన్న ఒక ఆటోలో మూడు రోజుల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. పసికందు ఏడుపులు విన్న రోగులు వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మూడు రోజుల వయసున్న ఆడశిశువును వైద్యురాలు వహీదా, సిబ్బంది చిన్న పిల్లల వార్డుకు తరలించి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు.

నెలలు నిండని కారణంగానే పసికందు తక్కువ బరువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పుట్టిన వెంటనే శిశువు అనారోగ్యంతో ఉన్నట్లు భావించిన కుటుంబ సభ్యులు పసికందును వదిలించుకోవడానికి ఆటోలో వదిలి ఉంటారని సిబ్బంది భావిస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శిశువును పరిశీలించారు. చిన్న పిల్లల వైద్య నిపుణులు పరిశీలించాక పసికందు ఆరోగ్యపరిస్థితిపై ఒక అంచనాకు రావచ్చు అని వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి పసికందు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:పసికందుని ఈడ్చుకెళ్లిన నక్క!

ABOUT THE AUTHOR

...view details