తెలంగాణ

telangana

ETV Bharat / state

మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం మధ్యాహ‌్నం వరకు 45 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో అత్యధికంగా 46.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా... జగిత్యాల జిల్లా ధర్మపురిలో 46.5, ఖమ్మం జిల్లా ఉంకూరులో 46.4డిగ్రీల ఉష్టోగ్రత నమోదైనట్లు టీఎస్​డీపీఎస్​ వెల్లడించింది.

heat wave warning for telangana
మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

By

Published : May 22, 2020, 4:43 PM IST

రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాడ్పులు కొనసాగుతున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 43 నుంచి 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

జర జాగ్రత్త

ఆదిలాబాద్‌, కొమరంభీం, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ పట్టణం, వరంగల్‌ గ్రామీణం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు.

మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

ఇదీ చూడండి :మృతదేహాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details