తెలంగాణ

telangana

ETV Bharat / state

జింఖానా మైదానంలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల పంపిణీ.. వారికి మాత్రమే.. - Cricket match Online tickets

ind vs Australia match tickets: భారత్-ఆసీస్‌ మ్యాచ్ టికెట్ల విక్రయాలపై గందరగోళం కొనసాగుతోంది. నిన్న టికెట్ల కొనుగోలు కోసం అంచనాలకు మించి క్రికెట్‌ అభిమానులు వచ్చారు. భారీ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈరోజు ప్రస్తుతానికి ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారు.. జింఖానా మైదానంలో టిక్కెట్లు తీసుకుంటున్నారు.

Cricket
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. వారికి మాత్రమే టికెట్ల పంపిణీ

By

Published : Sep 23, 2022, 12:16 PM IST

ind vs Australia match tickets: ఉప్పల్‌ మైదానం వేదికగా ఈ నెల 25న జరిగే భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల విక్రయాలపై గందరగోళం కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి జింఖానాలో మైదానంలో టిక్కెట్లు ఇస్తామని తొలుత ప్రకటించారు. టిక్కెట్లు తీసుకునేందుకు వచ్చిన వారిని మళ్లీ అయోమయానికి గురి చేశారు. ఎలాంటి టిక్కెట్లు ఇవ్వడం లేదంటూ హెచ్‌సీఏ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సీని చూపి క్రికెట్ అభిమానులను పోలీసులు పంపించి వేశారు.

ఆ తర్వాత కొద్ది సమయానికి పేటీఎం నిర్వాహకులు.. జింఖానా మైదానానికి చేరుకున్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి టికెట్లు ఇస్తున్నారు. క్యూఆర్‌కోడ్ పరిశీలించి టికెట్లు పంపిణీ చేస్తున్నారు. తొలుత టిక్కెట్లు ఇస్తామని.. ఆ తర్వాత ఇవ్వమని గందరగోళానికి గురి చేశారని క్రికెట్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారు.. టిక్కెట్లు తీసుకుంటున్నారు. నిన్న టికెట్ల కొనుగోలు కోసం అంచనాలకు మించి క్రికెట్‌ అభిమానులు వచ్చారు. భారీ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొంతమంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details