కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ చేయట్లేదని బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని మంత్రి నివాసంలో బత్తిని హరినాథ్ గౌడ్ కలిసి వినతిపత్రం అందజేశారు. మృగశిర కార్తె సందర్భంగా ఏటా దేశ విదేశాలనుంచి వేలాది మంది చేప మందు కోసం హైదరాబాద్ వచ్చేవారని... ఈ ఏడాది మాత్రం ఎవ్వరూ రావొద్దని హరినాథ్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు.
'ఈసారి చేప ప్రసాదం పంపిణీ చేయట్లేదు' - మృగశిర కార్తె
హైదరాబాద్ మారేడ్‌పల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు బత్తిని హరినాథ్ గౌడ్ కలిసి వినతి పత్రం అందించారు. కరోనా వైరస్ కారణంగా ఈసారి మృగశిర కార్తెకు చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని విన్నవించారు.
'ఈసారి చేప ప్రసాదం పంపిణీ చేయట్లేదు'
స్వీయ నియంత్రణ, భౌతిక దూరం, పరిశుభ్రత పాటించటం వల్లే కరోనాను అరికట్టడం సాధ్యమవుతుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.