తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్‌గ్రేడ్‌ చేయకపోతే ఇలాగే జరుగుతుంది.. బెంగళూరు వరదలపై కేటీఆర్‌ ట్వీట్‌ - బెంగళూరును ముంచెత్తిన వరద

KTR Tweet On Bengaluru Floods:పెరుగుతున్న పట్టణీకరణతో మౌలిక వసతులను అప్‌గ్రేడ్‌ చేసేందుకు తగినంత మూలధనం లేకపోతే బెంగళూరు నగరంలాగే జరుగుతుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. మన నగరాలే దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపిస్తాయని చెప్పారు. అటువంటి నగరాల్లో మౌలిక వసతులు బాగుండాలని ట్వీట్ చేశారు.

కేటీఆర్
కేటీఆర్

By

Published : Sep 5, 2022, 7:20 PM IST

KTR Tweet On Bengaluru Floods: కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా ఐటీ కారిడార్‌లోని తమ కంపెనీలకు రూ.225కోట్ల నష్టం వాటిల్లినట్లు బెంగళూరు ఔటర్‌ రింగ్‌రోడ్‌ కంపెనీస్‌ అసోసియేషన్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి లేఖ కూడా రాసింది. దీనిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్‌ వేదికగా స్పందించారు. పెరుగుతున్న పట్టణీకరణతో మౌలిక వసతులను అప్‌గ్రేడ్‌ చేసేందుకు తగినంత మూలధనం లేకపోతే ఇలాగే జరుగుతుందని బెంగళూరు నగరాన్ని ఉద్దేశించి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

‘‘మన నగరాలే దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపిస్తాయి. అటువంటి నగరాల్లో మౌలిక వసతులు బాగుండాలి. నాణ్యమైన రోడ్లు, నీరు, గాలి, నీటి నిర్వహణ సదుపాయాలు కల్పించడం పెద్ద కష్టమైన పని కాదు. అందుకు అవసరమైన మూలధనాన్ని కేంద్ర హౌసింగ్‌, అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ చూసుకోవాలి. పట్టణ ప్రణాళిక పాలనలో మనకు సంస్కరణలు చాలా అవసరం. నేను చెప్పిన మాటలు చాలా మంది హైదరాబాదీలకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే గతంలో ఇదే పరిస్థితి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కొందరు బెంగళూరు నేతలు మనల్ని విమర్శించారు. కానీ ఒక దేశంగా ఎదగాలంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి’’ అని ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details