సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన షేక్ ఇస్మాయిల్ దినసరి కూలీగా పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు. చిన్నారుల వద్దకు వెళ్లి వాళ్ల తండ్రి స్నేహితుడినని చెప్పి... చెవిదుద్దులు, కాళ్ల పట్టిలను తీసుకొని రమ్మన్నాడని చెప్పి ఎత్తుకెళ్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
దొంగ అరెస్ట్... - hyderabad
దొంగతనం చేసేవారు కొత్త పద్ధతులు వెతుకుతున్నారు. పెద్దవారైతే ఇబ్బంది అవుతుందని చిన్నారులను మభ్యపెట్టి వారి నుంచి చెవిదుద్దులు, కాళ్ల పట్టిలు ఎత్తుకెళ్తున్నారు. తాజాగా ఇటువంటి దొంగతానానికి పాల్పడతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
దొంగతనం చేసేవారు కొత్త పద్ధతులు వెతుకుతున్నారు
నగరంలో పలు కాలనీల్లో సంచరిస్తూ చిన్నారులను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నిందితుడిపై హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 12 కేసులు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో కేసు నమోదైనట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:భారత్‌కు 'అభి'నందనం