తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Inter exams 2022: మే నెలలో ఇంటర్​ పరీక్షలు.. ప్రణాళిక సిద్ధం! - తెలంగాణ వార్తలు

Inter exams 2022 : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ప్రణాళిక సిద్ధమైనట్లుగా సమాచారం. మే 2 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారని తెలిసింది. ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల మే నెలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Inter exams 2022, intermediate exam schedule
ఇంటర్‌ పరీక్షలకు ప్రణాళిక సిద్ధం..!

By

Published : Jan 8, 2022, 7:21 AM IST

Inter exams 2022 : ఇంటర్‌ వార్షిక పరీక్షలు మే నెల 2వ తేదీ నుంచి మొదలవుతాయని సమాచారం. 2వ తేదీ నుంచి ప్రారంభించి ఆ నెల 20వ తేదీకి పూర్తిచేసేలా ఇంటర్‌బోర్డు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు ఏప్రిల్‌లో పరీక్షలు జరుపుతామని బోర్డు ప్రకటిస్తూ వస్తోంది. ఆలస్యంగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడం, కరోనా మూడో దశ తదితరాలను దృష్టిలో పెట్టుకుని కాస్త ఆలస్యంగా మే నెలలో మొదలుపెట్టాలని బోర్డు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

వ్యవధి ఉంటుందా?

ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 2.35 లక్షల మంది తప్పారు. వారందరినీ కనీస మార్కులు ఇచ్చి పాస్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆ మార్కులతో సంతృప్తిపడని వారు ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకోవచ్చని పేర్కొంది. వారిలో కనీసం 50 శాతం మంది ఇంప్రూవ్‌మెంట్‌ రాస్తారని అంచనా. ఈ క్రమంలో అసలే ఒత్తిడిలో ఉన్న ఆ విద్యార్థులు ఒక రోజు ప్రథమ, మరుసటి రోజు ద్వితీయ పరీక్షలు రాయాలంటే ఆందోళనకు గురవుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం ప్రధాన సబ్జెక్టుల పరీక్షల మధ్యనైనా రెండు రోజుల వ్యవధి ఉంటే బాగుంటుందని, ఆ దిశగా బోర్డు కాలపట్టిక రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:Inter first year results: ఇంటర్​ ఫస్టియర్ ఫెయిలయిన విద్యార్థులకు గుడ్​న్యూస్

ABOUT THE AUTHOR

...view details