హైదరాబాద్ ముషీరాబాద్‌లోని చేపల మార్కెట్లో లాక్డౌన్ నియమ నిబంధనలు పాటించక పోవడం వల్ల పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఫలితంగా మార్కెట్లో జనం లేక వెలవెలబోయింది. మృగశిర కార్తె రోజు చేపలు తినడం ఆనవాయితీగా ఉన్న నేపథ్యంలో ముషీరాబాద్ చేపల మార్కెట్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉదయం నుంచే పోలీసులు పహారా కాస్తూ భౌతిక దూరాన్ని పాటించని వ్యాపారస్తులను మందలించారు.
భౌతిక దూరం పాటించలేదు !
మృగశిర కార్తెను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నుంచి అనేక రకాల చేపల లారీలు.. పెద్ద ఎత్తున ముషీరాబాద్ మార్కెట్‌కు దిగుమతి అయ్యాయి. మార్కెట్ నుంచి చేపలు కొనుగోలు చేయడానికి ప్రజలు, చిన్న వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు, మార్కెట్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానిక వ్యాపారస్తులూ భౌతిక దూరం పాటించలేదు.