తెలంగాణ

telangana

ETV Bharat / state

వైన్​షాపులో చోరీ... రూ.18 లక్షలు మాయం - crime

వైన్​షాప్​ గోడకు రంధ్రం చేసి లాకర్​లో ఉన్న 18 లక్షల నగదును ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటన హైదరాబాద్​ నారాయణగూడ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. షాప్​ నిర్వాహకుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అర్ధరాత్రి వైన్​షాపులో చోరీ

By

Published : Nov 11, 2019, 11:12 PM IST

ఓ వైన్ షాప్ వెనుక గోడకు రంధ్రం చేసి లోపలికి చొరబడి లాకర్​లో ఉన్న రూ.18 లక్షల నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన హైదరాబాద్ నారాయణగూడ పీఎస్​ పరిధిలో జరిగింది. బంజారాహిల్స్​లో నివాసం ఉండే మాన్మీత్ సింగ్ హిమాయత్ నగర్​లోని ఓ భవనంలో షటర్ అద్దెకు తీసుకుని కుల్​దీప్ వైన్స్ ఏర్పాటు చేశాడు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో వైన్​షాపులో పనిచేసే సిబ్బంది తాళం వేసి వెళ్లి పోయారు. మూడు రోజులుగా మద్యం విక్రయించగా వచ్చిన డబ్బు రూ.18 లక్షల నగదును లాకర్​లో భద్రపరిచారు .

దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసి లోపలికి వెళ్లి లాకర్​ను పగులగొట్టి అందులో దాచిన నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం వైన్​షాప్​లో పనిచేసే సిబ్బంది వచ్చి దుకాణం తెరిచారు. గోడకు రంధ్రం ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కుల్​దీప్ వైన్స్ నిర్వాహకుడు మాన్మీత్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ భవనంలో పని చేసే నేపాల్ దేశానికి చెందిన వాచ్​మెన్ కనిపించకుండా పోవడం వల్ల అతడే చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అర్ధరాత్రి వైన్​షాపులో చోరీ

ఇవీ చూడండి: చోరీలకు పాల్పడుతున్న యువకుడి అరెస్టు

ABOUT THE AUTHOR

...view details