రెండు జాతీయ రహదారుల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని కోరడంతో కేంద్రం నిధులు కేటాయించిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తన పరిధిలో పూర్తయిన రెండు జాతీయ రహదారులను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహాదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి... కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్చువల్ విధానంలో హైదరాబాద్‌లోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ కార్యాలయంలో ప్రారంభించారు.
తను చేసిన కృషికి ఇప్పటికే రెండు జాతీయ రహదారుల విస్తరణ పనులు పూర్తయి సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులో వచ్చాయని వివరించారు. పలుమార్లు కేంద్ర మంత్రిని కలిసి పదేపదే కోరగా మరో రెండు జాతీయ రహదారుల పనులకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. జాతీయ రహదారి నెంబర్ 365లో నకిరేకల్ నుంచి తానంచెర్ల వరకు మొత్తం 66.563 కిలోమీటర్ల రోడ్డు పనులు రూ. 605.08 కోట్లతో పూర్తి చేసినట్లు తెలిపారు. యాదాద్రి నుంచి వరంగల్ వరకు 99.103 కిలో మీటర్ల రోడ్డును రూ. 1889.72 కోట్లతో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు.