దేశవ్యాప్తంగా పరిశోధన విద్యార్థులకు ఇక నుంచి నెలవారీగా ఫెలోషిప్ నగదు అందనుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్), సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(ఎస్‌ఆర్‌ఎఫ్) కింద ఎంపికైన వారికి ప్రతినెలా నగదు మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మేరకు తాజాగా యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రతి మూణ్నెల్లకు ఒకసారి ఫెలోషిప్‌లను చెల్లిస్తున్నారు. జేఆర్‌ఎఫ్ కింద నెలకు రూ.31 వేలు, ఎస్‌ఆర్‌ఎఫ్‌కు ఎంపికైన వారికి రూ.35 వేలు అందజేస్తున్నారు. పరిశోధన విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నెలవారీగా చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ తెలిపింది. ఇన్‌స్పైర్ ఉపకార వేతనం అందకపోవడం వల్ల దిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాలలో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్న షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్యారెడ్డి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపకార వేతనాలను గతానికి భిన్నంగా నెలవారీగా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
నవంబరు నగదును కూడా త్వరలో విడుదల