తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థతో ఓయూ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అవగాహన ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో వీటికి సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ఓయూ ఉపకులపతి ఆచార్య రామచంద్రం, టీఎస్ఎస్పీడీఎల్ హెచ్ఆర్ డైరెక్టర్ పర్వతం సమక్షంలో ఓయూ రిజిస్ట్రార్ ఆచార్య గోపాల్ రెడ్డి, టీఎస్ఎస్పీడీఎల్ కార్పోరేట్ కార్యాలయ సీజీఎమ్ ఏజీ సతీశ్ కుమార్లు పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ విధంగా పరిశోధనలను సంస్థ, విద్యార్థులు పరస్పరం జ్ఞానాన్ని పంచుకోవటం శుభ సూచకమని వీసీ రామచంద్రం అన్నారు. ఈ ఒప్పందం వల్ల ఈసీఈ, ఈఈఈ విద్యార్థులకు క్షేత్రస్థాయిలో శిక్షణతో పాటు తరగతులను నిర్వహించనున్నట్లు సతీశ్ కుమార్ తెలిపారు.
ఉస్మానియాతో ఎంవోయూ కుదుర్చుకున్న టీఎస్ఎస్పీడీఎల్
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఉస్మానియాతో ఎంవోయూ కుదుర్చుకున్న టీఎస్ఎస్పీడీఎల్