తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ సీఎం జగన్ కేసుల విచారణ ఈ నెల 12కి వాయిదా - cbi cases on jagan

సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ కేసుల విచారణ ఈ నెల 12కి వాయిదా పడింది. హైకోర్టు స్టే ఉన్న కొన్ని కేసులు నవంబర్‌ 9కి వాయిదా పడ్డాయి. ముఖ్యమంత్రి జగన్‌ తరఫు న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కోరారు.

ఏపీ సీఎం జగన్ కేసుల విచారణ ఈ నెల 12కి వాయిదా
ఏపీ సీఎం జగన్ కేసుల విచారణ ఈ నెల 12కి వాయిదా

By

Published : Oct 9, 2020, 4:48 PM IST

హైదరాబాద్​ సీబీఐ, ఈడీ కోర్టులో ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ కేసుల విచారణ వాయిదా పడింది. జగన్ కేసుల విచారణను ఈ నెల 12కి కోర్టు వాయిదా వేసింది. హైకోర్టు స్టే ఉన్న కొన్ని కేసులు నవంబర్‌ 9కి వాయిదా పడ్డాయి. జగన్‌ తరఫు న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కోరారు.

హెటిరో, అరబిందోల సంస్థలకు భూకేటాయింపులు, జగతిలో పెట్టుబడులు, పెన్నా ఇండియా, దాల్మియా, భారతి సిమెంట్స్‌కు లీజులు, ఇందూగ్రూపు, వాన్‌పిక్‌కు భూకేటాయింపులు తదితరాలపై సీబీఐ నమోదు చేసిన 11 కేసులపై విచారణ జరిగింది. వీటితో పాటు ఎమ్మార్‌ విల్లాలు, ప్లాట్ల కేటాయింపుపై నమోదైన కేసు, ఓబుళాపురం గనుల లీజు వ్యవహారాలపై నమోదైన కేసులతోపాటు జగన్‌ కేసుల్లో పెట్టుబడుల నిధుల బదలాయింపుల్లో అవకతవకలపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ నమోదు చేసిన 5 కేసులు, ఎమ్మార్‌ వ్యవహారంపై ఈడీ కేసులు విచారణకొచ్చాయి.

ఇదీ చదవండి:నామినేషన్​కు భారీ భద్రతా చర్యలు: సీపీ జోయల్​

ABOUT THE AUTHOR

...view details