సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పలు డెయిరీల్లో సభ్యులుగా ఉన్న లబ్దిదారులుకు... త్వరలోనే పాడి గేదెలను పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ పశు సంక్షేమ భవన్‌లో జరిగిన విజయ డెయిరీ బోర్డ్ సమావేశానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
కరోనా మహమ్మారి ఆరంభంలో లాక్‌డౌన్ ఆంక్షలు, ఇతర కారణాలతో పాడి గేదెల పంపిణీ తాత్కాలికంగా నిలిచిపోయిన దృష్ట్యా... మళ్లీ ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పాడిగేదెలు కొనుగోలు సమయంలో బీమా సౌకర్యం కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన పాడి గేదెల్లో 2,691 చనిపోయాయని... వాటికి సంబంధించి క్లెయిమ్ కింద పాడి గేదెలు కొనుగోలు చేసి... పంపిణీ చేసే ప్రక్రియ వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించారు.