తెలంగాణ

telangana

By

Published : Aug 5, 2020, 2:38 PM IST

Updated : Aug 5, 2020, 5:39 PM IST

ETV Bharat / state

కూకట్​పల్లి కిందికుంట చెరువు ఆక్రమణపై హైకోర్టులో విచారణ

కూకట్​పల్లి కింది కుంట చెరువును... కబ్జా నుంచి కాపాడాలన్న పిల్​పై హైకోర్టులో విచారణ జరిగింది. చెరువును పరిశీలించి ఆక్రమణలు ఉంటే చర్యలు తీసుకోవాలని కలెక్టర్​కు న్యాయస్థానం ఆదేశించింది. చెరువులు కబ్జా అవుతుంటే కలెక్టర్లు ఏం చేస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. కింది కుంట చెరువు కబ్జాపై ఈ నెల 13 లోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్​ను హైకోర్టు ఆదేశించింది.

కూకట్​పల్లి కిందికుంట చెరువు ఆక్రమణపై హైకోర్టులో విచారణ
కూకట్​పల్లి కిందికుంట చెరువు ఆక్రమణపై హైకోర్టులో విచారణ

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చెరువులు కబ్జా అవుతుంటే.. కలెక్టర్లు ఏం చేస్తున్నారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కూకట్​పల్లి మండలం హైదర్​నగర్​లోని కింది కుంట చెరువును సందర్శించి.. ఆక్రమణలు ఉంటే తొలగించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్​ను హైకోర్టు ఆదేశించింది. కింది కుంట చెరువును కబ్జా నుంచి కాపాడాలని కోరుతూ 16 మంది స్థానికులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

అధికారులను వివరాలు అడిగి చెబుతానని ప్రభుత్వం తరఫున న్యాయవాది పేర్కొన్నారు. కలెక్టర్ వ్యక్తిగతంగా వెళ్లి పరిశీలించాలని.. ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:ఇలా ఆవిరిపడితే ముఖం వెలిగిపోవాల్సిందే!

Last Updated : Aug 5, 2020, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details