ఉపాధి హామీ నిధులతో రాష్ట్రంలో రైతుల కోసం లక్ష కల్లాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. రూ.750 కోట్ల వ్యయంతో కల్లాల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 50, 60, 75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో.... 56, 68, 85 వేల యూనిట్ వ్యయంతో కల్లాల నిర్మాణం చేపట్టాలని సూచించింది.
స్వయం సహాయక సభ్యులు, రైతుల స్థలాల్లో కల్లాల నిర్మాణం చేపట్టుకోవచ్చని పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల భూముల్లో ఉచితంగా కల్లాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపింది. మిగతా రైతులకు 10 శాతం భాగస్వామ్యంతో కల్లాల నిర్మాణం చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాష్ట్రంలో లక్ష కల్లాల నిర్మాణం.. రూ.750 కోట్లు విడుదల
రాష్ట్రంలో లక్ష కల్లాల నిర్మాణం.. రూ.750 కోట్లు విడుదల
14:47 June 15
రాష్ట్రంలో లక్ష కల్లాల నిర్మాణం.. రూ.750 కోట్లు విడుదల
Last Updated : Jun 15, 2020, 5:29 PM IST