తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు నైరుతి ఆలస్యమే - ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు నైరుతి ఆలస్యమే

ఈఏడు దీర్ఘకాల సగటులో 100% వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ ఎ.మహాపాత్ర ప్రకటించారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు వస్తాయని తెలిపారు.

the-southwest-monsoon-is-late-this-year-in-telugu states
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు నైరుతి ఆలస్యమే

By

Published : Apr 16, 2020, 11:35 AM IST

నైరుతి రుతుపవనాల కాలంలో (జూన్‌- సెప్టెంబర్‌) ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షం కురుస్తుందని భూ విజ్ఞాన శాస్త్ర కార్యదర్శి ఎం.రాజీవన్‌, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ ఎ.మహాపాత్ర ప్రకటించారు. ఈ ఏడాది రుతుపవనాలపై తొలి ముందస్తు అంచనాలను వారు బుధవారం విడుదల చేశారు. దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ)లో 100% (5% అటూఇటూగా) వర్షపాతం ఈసారి నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు మూడు నుంచి ఏడు రోజుల ఆలస్యంతో నైరుతి వస్తుందని చెప్పారు.

ప్రధాన నగరాలకు నిరీక్షణే

కేరళ తీరానికి రుతుపవనాలు జూన్‌ 1 నాటికి వస్తాయని రాజీవన్‌ వెల్లడించారు. కొన్ని ప్రాంతాలకు రుతుపవనాల ఆగమనం సాధారణం కంటే 3 నుంచి 7 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం జులై 15కి బదులు జులై 8కే చేరుకోనున్నట్లు వెల్లడించారు. రుతుపవనాల ఉపసంహరణ వాయువ్య భారతంలో సాధారణం కంటే 7-14 రోజులు ఆలస్యమవుతుందన్నారు. నైరుతి రుతుపవనాల చివరి దశ ఉపసంహరణ మాత్రం ఎప్పటిలా అక్టోబర్‌ 15న జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్‌, విశాఖపట్నాల్లో రుతుపవనాల ఉపసంహరణ ఒకరోజు ముందే జరుగుతుందన్నారు. ఇప్పటివరకూ రుతుపవనాల రాక, ఉపసంహరణకు 1901-1940 మధ్య ఉన్న సమాచారంపై ఆధారపడేవాళ్లమని చెప్పారు. ఈసారి మాత్రం రుతుపవనాల రాకకు 1961-2019 మధ్య వివరాలను, ఉపసంహరణకు 1971-2019 మధ్య గణాంకాలను ఆధారంగా చేసుకున్నామని వివరించారు.

ఇదీ చదవండి:దేశంలో విజృంభిస్తున్న కరోనా.. 11,540 కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details