పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ సేవలు చిరస్మరణీయమని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. నేడు వారి వర్ధంతిని పురస్కరించుకుని.. సిమ్లాలోని రాజ్ భవన్లో ఘనంగా నివాళులు అర్పించారు.
సమాజంలో కొందరు మరణించేవరకు జీవిస్తారని, మరికొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారని దత్తాత్రేయ పేర్కొన్నారు. పండిట్ రెండో కోవకు చెందుతారని చెప్పుకొచ్చారు. దూరదృష్టి, మానవతా విలువలు కలిగిన మహానాయకుడని కొనియాడారు.