మహిళలకు దక్షిణ మధ్య రైల్వే అత్యంత ప్రాధాన్యనిస్తోంది. జోన్ పరిధిలో 80వేల 527 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని... నిత్యం సుమారు 745 రైళ్లలో 10.50 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య పేర్కొన్నారు. మొత్తం ఉద్యోగుల్లో 11శాతం అనగా 8,968 మంది మహిళలు ఉన్నట్లు ఆయన వివరించారు.
'దక్షిణమధ్య రైల్వేలో మహిళా ఉద్యోగులది ప్రత్యేక స్థానం' - దక్షిణమధ్య రైల్వేలో మహిళా ఉద్యోగులు
దక్షిణ మధ్య రైల్వేలో మహిళలకు పెద్దపీట వేశారు. జోన్ పరిధిలోని మొత్తం ఉద్యోగుల్లో 11శాతం మహిళా ఉద్యోగులకే కేటాయించారు. లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, ట్రాక్ నిర్వహణ, టెక్నిషియన్లు ఇలా రైల్వేలో ఉన్న దాదాపు అన్ని విభాగాల్లో మహిళా ఉద్యోగులకు అవకాశం కల్పించారు.
'దక్షిణమధ్య రైల్వేలో మహిళలది ప్రత్యేక స్థానం'
మహిళా ఉద్యోగులతో ప్రత్యేక రైలు
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులతో ప్రత్యేకంగా సికింద్రాబాద్ నుంచి వికారాబాద్‌కు ప్రయోగాత్మకంగా రైలు నడిపించారు. ఇందులో లోకో పైలట్, సహ పైలెట్, టికెట్ కలెక్టర్, రక్షణ సిబ్బంది, స్టేషన్ మేనేజర్, ట్రాక్ నిర్వహణ చేసే సిబ్బంది అంతా మహిళలే ఉండడం విశేషం. వీటితో పాటు బేగంపేట, విద్యానగర్, చంద్రగిరి, రామవరప్పాడు రైల్వే స్టేషన్లు పూర్తిగా మహిళా ఉద్యోగులతోనే నిర్వహిస్తున్నామని ద.మ. జీఎం గజానన్ మాల్య స్పష్టం చేశారు.