తెలంగాణ

telangana

మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికపై కసరత్తు...

By

Published : Jan 26, 2020, 7:11 PM IST

రాష్ట్రంలో కార్పొరేషన్‌ మేయర్లు, పురపాలిక ఛైర్‌పర్సన్ల ఎంపికపై తెరాస కసరత్తు ప్రారంభించింది. స్థానిక నాయకత్వంతో సమన్వయం చేస్తున్న తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ ఫోన్​లో మాట్లాడారు. ఒక్కో పదవికి కనీసం రెండు పేర్లతో జాబితా ఖరారు చేసి కేటీఆర్ కేసీఆర్‌కు పంపించారు. జాబితాపై ఇవాళ సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

The selection of mayors and chairpersons is finalized today in telangana
మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికపై నేడు తుదినిర్ణయం

తెలంగాణలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార తెరాస పార్టీ దూసుకెళ్లింది. పలు డివిజన్లలో కార్పొరేషన్లను, పురపాలక స్థానాలను కైవసం చేసుకుంది. మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ అభ్యర్థుల ఎంపికపై కేటీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్​ మేయర్లు, పురపాలిక ఛైర్​పర్సన్ల ఎంపికపై ఈరోజు మంత్రి కేటీఆర్​ మంత్రులు, ఎమ్మెల్యేలతో ఫోన్​లో మాట్లాడారు. తొంభై శాతం స్వతంత్రులు తెరాసకు మద్దతుగా ఉన్నారని కేటీఆర్‌కు ఎమ్మెల్యేలు తెలిపారు.

ఒక్కో పదవికి కనీసం రెండు పేర్లతో జాబితా ఖరారు చేసి కేటీఆర్ కేసీఆర్‌కు పంపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్‌పర్సన్ అభ్యర్థులను రాత్రి వరకు ఖరారు కేసీఆర్ చేయనున్నారు. రేపు ఉదయంలోగా స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వనున్నట్టు సమాచారం.

ఇదీ చూడండి : మేడారం వచ్చిన భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details