తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ ఎఫెక్ట్​: నిండు గర్భిణి 115 కి.మీ. నడక - The pregnant woman is 115 km Walking in ananthapuram

అసలే ఎనిమిది నెలల నిండు గర్భిణి.. ఇలాంటి పరిస్థితిలో కడుపులో బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ లాక్​డౌన్ కష్టాలతో సొంతూరికి వెళ్లాలనే ఆరాటంతో... ఓ మహిళ 115 కిలోమీటర్ల కాలినడకన ప్రయాణించిన ఘటన ఏపీ అనంతపురంలో చోటుచేసుకుంది.

the-pregnant-woman-is-115-km-walking
లాక్​డౌన్​ ఎఫెక్ట్​: నిండు గర్భిణి 115 కి.మీ. నడక

By

Published : May 4, 2020, 10:11 AM IST

లాక్‌డౌన్‌ పొడిగించడంతో సొంతూరికి వెళ్లాలని ఎనిమిది నెలల గర్భిణి సలోని.. 115 కి.మీ. కాలినడకన ప్రయాణించింది. కర్ణాటకలోని చెళ్లికెర నుంచి 2రోజుల కిందట ఆరుగురు కుటుంబసభ్యులతో బయలుదేరిన ఆమె​ అనంతపురానికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన ఆమె కుటుంబం చెళ్లికెరకు వలస వెళ్లింది. సుదూర ప్రయాణం అనంతరం ఆదివారం మధ్యాహ్నం అనంతపురానికి చేరుకున్న ఆమెకు సీటీఓ కార్యాలయంలో పనిచేస్తున్న పద్మావతి భోజనాన్ని సమకూర్చారు. అన్నం పెట్టి విచారించగా గర్భిణి తన బాధను చెప్పుకున్నారు. గర్భిణిని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పరామర్శించారు. అధికారిణి పద్మావతి స్పందించి కలెక్టర్‌, ఎస్పీతో అనుమతి తీసుకుని వారిని ఆదివారం రాత్రి స్వగ్రామానికి పంపించారు.

ABOUT THE AUTHOR

...view details