పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వంతో పాటు వైద్యులు కూడా ముందుకు రావాలని రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్‌గౌడ్ కోరారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఆసుపత్రిలోనైనా వైద్యులపైనా దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంలోనూ.... వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో ఎస్‌ఆర్‌ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా స్థిరాస్తి వ్యాపార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యరత్న అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు ఎస్‌ఆర్‌ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా స్థిరాస్తి వ్యాపార సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రముఖ సినీ దర్శకులు సుకుమార్ తదితరులు పాల్గొని.. ఆయా రంగాల్లో నిపుణులైన దాదాపు 40 మంది వైద్యులను వైద్యరత్న ఆవార్డులతో ఘనంగా సత్కరించారు.
'జనాభా పెరుగుతోంది... వైద్యుల సంఖ్య తగ్గుతోంది' - శ్రీనివాస్‌గౌడ్
రాష్ట్రంలో జనాభా పెరుగుతుంది... వైద్యులు సంఖ్య తగ్గుతుందని మంత్రులు ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో ఎస్‌ఆర్‌ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా స్థిరాస్తి వ్యాపార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యరత్న అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.
వైద్యురాలిని సన్మానిస్తున్న మంత్రులు