Doctors Negligence: వైద్యులు మనకు ఏదైనా అనారోగ్యం వస్తే నయం చేసే దేవుళ్లుగా భావిస్తాం. ఆ డాక్టర్ని నమ్ముకొని ప్రాణమే అతనికి అప్పచెప్తాం. కాని వారే కోత్త సమస్యకు కారణమైతే.. ఆ రోగి పరిస్థతి ఏంటి..? ఇక అసలు విషయానికి వస్తే.. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అను హాస్పిటల్‌కి ఓ రోగి ఆరోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్తే అది నయం చేసే క్రమంలో వైద్యుల నిర్లక్ష్యంతో ఇంకో కొత్త సమస్య సృష్టించారు. దీంతో ఆ పేషంట్ ఆరోగ్యం విషమంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఉన్న అను హాస్పిటల్‌కి మచిలీపట్నానికి చెందిన కొరివిడి శివపార్వతి, గర్భసంచి సమస్యతో ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు గర్భసంచి తొలగించి వైద్యులు ఆపరేషన్ చేశారు. అనంతరం 6నెలల తరబడి తరచూ కడుపునొప్పితో బధపడుతూ.. అను హాస్పిటల్ వైద్యులను సంప్రదించగా నెమ్మదిగా తగ్గుతుందని చెప్పారని పేషెంట్ బంధువులు తెలిపారు.
ఇక ఎంతకీ తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు హరిణి హాస్పిటల్‌కి తరలించారు. హరిణి హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ చేసి అవాక్కయ్యారు. ఎందుకంటే.. అను హాస్పటల్ వైద్యులు ఆపరేషన్ చేసి సర్జికల్ క్లాత్‌ను కడుపులోనే మర్చిపోయారు. దీంతో పేషంట్ పొట్టలో ఉన్న సర్జికల్ క్లాత్‌ను హరిణి హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ చేసి బయటికి తీశారు.