తమిళనాడులో జరిగిన నాలుగో జాతీయస్థాయి ఫిస్ట్ బాల్ పోటీల్లో ఛాంపియన్స్‌గా నిలిచిన రాష్ట్ర జట్టును పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. వారి క్రీడా నైపుణ్యాన్ని ప్రశంసించిన ఆయన... భవిష్యత్తులోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
జాతీయస్థాయి ఫిస్ట్ బాల్ విజేతలకు ఎర్రబెల్లి అభినందనలు
నాలుగో జాతీయస్థాయి ఫిస్ట్ బాల్ పోటీల్లో గెలుపొందిన రాష్ట్ర జట్టును పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశంసించారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
నాలుగో జాతీయస్థాయి ఫిస్ట్ ఛాంపియన్స్ బాల్ పోటీ
విజేతలుగా నిలిచిన జట్టులో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం, చెన్నూరు గ్రామానికి చెందిన నలుగురు ఆటగాళ్లు ఉండడంపై ఎర్రబెల్లి సంతోషం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా నుంచి ముగ్గురు, హైదరాబాద్ నుంచి మరో ముగ్గురు ఉన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడలకు, క్రీడాకారులకు మంచి ఆదరణ లభిస్తోందని మంత్రి అన్నారు.
ఇదీ చదవండి:మీరూ ‘కరోనాసోమియా’తో బాధపడుతున్నారా?