రాష్ట్ర గొర్రెల కాపరులు.. తమ సమస్యలపై పోరుకు దిగారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద తమకు జరుగుతున్న అన్యాయం పట్ల ఆందోళన చేపట్టారు.డిమాండ్లను పరిష్కరించాలంటూ.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి గొర్రెలకాపరులు భారీగా తరలివచ్చారు. అయితే ధర్నాకు అనుమతి లేదని పోలీసులు వీరందరిని అరెస్ట్ చేశారు. సంవత్సరం నుంచి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించినా... సబ్సిడీ గొర్రెలను ఇవ్వలేదని... అడిగితే... ఇలా బలవంతంగా అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమని గొర్రెలకాపరులు ఆరోపించారు.
డబ్బులు చెల్లించినా... సబ్సిడీ గొర్రెలేవి? - ఇందిరాపార్కు
తమ సమస్యలు పరిష్కరించాలంటూ.. ఇందిరాపార్కు వద్ద గొర్రెల కాపరులు ఆందోళనకు దిగారు. పోలీసులు వీరిని అరెస్టు చేసి వివిధ ఠాణాలకు తరలించారు.
సబ్సిడీ గొర్రెలేవి?