చివరి శ్వాసవరకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి జీవించిన మహోన్నత వ్యక్తి బంగారు లక్ష్మణ్ అని హిమచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సిద్ధాంతపరంగా, రాజకీయంగా, సాంఘికంగా తనను ప్రోత్సహించిన వ్యక్తి లక్ష్మణ్ అని అన్నారు. పేద కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థానానికి ఎదిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రవీంద్రభారతిలో భాజపా మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ 87వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఎంత ఎదిగినా..
ఎన్ని ఉన్నత పదవులు అలంకరించినా.. లక్ష్మణ్ ఎలాంటి ఆస్తులు సంపాదించుకోలేదని దత్తాత్రేయ అన్నారు. అభిమానించే నాయకులు, కార్యకర్తలే ఆయన ఆస్తులని వెల్లడించారు. లక్ష్మణ్ రాజకీయ జీవితం.. నేటితరం నాయకులకు ఆదర్శమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. వేడుకల్లో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ధరణి రైతులకు వరం... పైరవీకారులకు ఆశనిపాతం: సీఎం