Registration Charges: భూముల మార్కెట్ విలువపెంపు ప్రక్రియలో హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. మార్కెట్ విలువల పెంపు కసరత్తులో ఎక్కువగా ఆదిశగా ఆలోచిస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని భూముల రిజిస్ట్రేషన్ విలువ బహిరంగా మార్కెట్ విలువతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. విలువ పెంచాలన్న నిర్ణయం నేపథ్యంలో స్టాంపులు - రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేశాద్రి నేతృత్వంలో.. సంయుక్త ఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు అందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు.
Registration Charges: భూముల విలువ పెంపు.. ఆ ప్రాంతాలపైనే ప్రధాన దృష్టి - భూముల మార్కెట్ విలువ
Registration Charges: భూముల మార్కెట్ విలువ పెంపు ప్రక్రియ జోరందుకుంది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. బహిరంగ మార్కెట్ క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్ల ప్రాతిపదికగా సవరణ చేయనున్నారు. కొత్త మార్కెట్ విలువల కసరత్తు ప్రక్రియను సాయంత్రం లోపు పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఆనంతరం ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదిస్తారు.
భూముల మార్కెట్ విలువ పెంపు ప్రక్రియ
land registrations: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని రిజిస్ట్రేషన్లు ఇందుకు పరిగణనలోకి తీసుకుంటున్నారు. బహిరంగ మార్కెట్ క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్న విలువలను ప్రాతిపదికగా తీసుకొని ధరల సవరణ చేస్తున్నారు. కొత్త మార్కెట్ విలువల కసరత్తు ప్రక్రియను సాయంత్రం లోపు పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఆనంతరం ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదిస్తారు.