తెలంగాణ

telangana

'6 నెలల కోర్సు చేసి.. శస్త్ర చికిత్సలు ఎలా చేస్తారు?'

ఇండియన్ మెడికల్ తెలంగాణ శాఖ అసోసియేషన్ ఆందోళన చేపట్టనుంది. ఆయుర్వేద వైద్యులు కూడా శస్త్ర చికిత్సలు చేయవచ్చంటూ.. కేంద్రం ఇచ్చిన కొత్త జీవోలను వ్యతిరేకిస్తూ.. ఈనెల 11న ధర్నా నిర్వహించనుంది.

By

Published : Dec 9, 2020, 12:28 PM IST

Published : Dec 9, 2020, 12:28 PM IST

doctors
'6 నెలల కోర్సు చేసి.. శస్త్ర చికిత్సలు ఎలా చేస్తారు?'

ఆయుర్వేద వైద్యులు కూడా శస్త్ర చికిత్సలు చేయవచ్చంటూ.. కేంద్రం ఇచ్చిన కొత్త జీవోలను వ్యతిరేకిస్తూ.. ఇండియన్ మెడికల్ తెలంగాణ శాఖ అసోసియేషన్ ఆందోళనకు సిద్ధమవుతోంది. కేవలం ఆరు నెలల కోర్సు చేసి.. శస్త్ర చికిత్సలు ఎలా చేస్తారని అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్​లో ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నూతన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తూ... ఈనెల 11న ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

సుమారు ఎనిమిదేళ్లు చదివిన తర్వాత ఒక ఎంబీబీఎస్​ వైద్యుడికి శస్త్ర చికిత్సలు చేయడానికి అర్హత లభిస్తే.. కేవలం ఆరు నెలల కోర్సు చేసి.. శస్త్ర చికిత్సలు ఎలా చేస్తారని వైద్యులు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే.. దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details