ఆంధ్రప్రదేశ్లో దిగువస్థాయి న్యాయవ్యవస్థలోని సభ్యులపై చేసే ఫిర్యాదుతోపాటు ప్రమాణపత్రం, ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు సమర్పించాలని, లేదంటే ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోలేమని ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్(నియామకాలు), ఎఫ్‌ఏసీ రిజిస్ట్రార్ విజిలెన్స్ సునీత ఉత్తర్వులు జారీచేశారు. పేరు, సంతకం, ప్రమాణపత్రం, ఆరోపణలకు బలం చేకూర్చే వివరాలు లేకుండా అందుకున్న ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు ఉండవన్నారు. అయినప్పటికీ వ్యవస్థ ప్రయోజనాల నిమిత్తం ఏ ఫిర్యాదుపైన అయినా విచక్షణాధికారం మేరకు ప్రధాన న్యాయమూర్తి.. ప్రాథమిక విచారణకు ఆదేశించవచ్చాన్నారు.
'ఆరోపణలకు బలమైన ఆధారాలు లేకుంటే చర్యలు తీసుకోలేం' - దిగువ న్యాయవ్యవస్థపై ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు
పేరు, సంతకం, ప్రమాణపత్రం, ఆరోపణలకు బలం చేకూర్చే వివరాలు లేకుండా అందుకున్న ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేమని ఏపీ హైకోర్ట్ రిజిస్ట్రార్ సునీత వివరణ ఇచ్చారు. అయితే.. వ్యవస్థ ప్రయోజన నిమిత్తం ఏ ఫిర్యాదుపైన అయినా.. ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారం మేరకు ప్రాథమిక విచారణకు ఆదేశించవచ్చని తెలిపారు.
'ఆరోపణలకు బలమైన ఆధారాలు లేకుంటే చర్యలు తీసుకోలేం'
విచారణ అనంతరం అది న్యాయవ్యవస్థను ఇబ్బందులకు గురిచేసే ఫిర్యాదు అని తేలినా.. ఆరోపణలను నిరూపించలేకపోయినా ఖర్చులు చెల్లించేలా ఫిర్యాదుదారున్ని ఆదేశించే అవకాశం ఉందన్నారు. గతంలో ఉన్న నిబంధనలకు అదనంగా ఈమేరకు మార్గదర్శకాలు జారీ చేశారు.
ఇదీ చదవండి:న్యాయ వ్యవస్థపై యుద్ధం ప్రకటించారా?.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు