TRS MLAs poaching case update: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే తదుపరి విచారణను సర్వోన్నత న్యాయస్థానం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టులో ఈ కేసు విషయంలో విచారణ కొనసాగుతున్నందున వాయిదా వేస్తునట్లు ధర్మాసనం తెలిపింది.
ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుల పిటిషన్‌పై విచారణ వాయిదా - ఎమ్మెల్యేల ఎర కేసులో పిటిషన్‌పై విచారణ వాయిదా
TRS MLAs poaching case update: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే తదుపరి విచారణను సర్వోన్నత న్యాయస్థానం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
అసలేం జరిగిందంటే..తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయనే తెలుగు రాష్ట్రాల్లో అంశం సంచలనం సృష్టించింది. సైబరాబాద్ పోలీసులు తమకు అందిన సమాచారంతో హైదరాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు చేశారు. తెరాసకు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: