ఖైరతాబాద్ గణేశ్‌ను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఉత్సవ సమితి సభ్యులు గవర్నర్‌ను శాలువాతో సత్కరించి వినాయకుడి చిత్రపటాన్ని బహుకరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని గవర్నర్ తమిళిసై తెలిపారు. ఈ రోజు సెలవు దినం అవడం వల్ల భారీ గణనాథున్ని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఖైరతాబాద్ పరిసరాలన్నీ జనసందోహంగా మారాయి.
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న గవర్నర్ - governer
ఖైరతాబాద్ వినాయకుడిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. భారీ వినాయకుడిని దర్శించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న గవర్నర్