రోజు రోజుకు మాతృభాషలు అంతరించిపోతున్నాయని... తెలుగు భాష అంతరించే ప్రమాదంలో ఉందని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషా పరిరక్షణ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు, కళాకారులు, రచయితలు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రవీంద్రభారతిలో వంశీ ఇంటర్నేషనల్- వేగేశ్న ఫౌండేషన్ నిర్వహించిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి 88వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినారె- ఆళ్ల స్వర్ణ కంకణం ప్రదానం చేశారు. ఇదే వేదికపై గోవిందరాజు రామకృష్ణారావు రాసిన 'సర్వాంగీణ ప్రతిభామూర్తి', కంపల్లె రవిచంద్రన్ రాసిన 'నీపేరు తలచినా చాలు' గ్రంథాలను ఆవిష్కరించారు. తెలుగు భాష ఉన్నన్ని రోజులు నారాయణరెడ్డి జీవించే ఉంటారని సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, సినీ నటి జమున, వంశీ సంస్థ వ్యవస్థాపకులు వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.
సిరివెన్నెలకి సినారె-ఆళ్ల స్వర్ణకంకణం ప్రదానం
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి 88వ జయంతి వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి.
సిరివెన్నెలకి సినారె-ఆళ్ల స్వర్ణ కంకరణం ప్రధానం
Last Updated : Jul 17, 2019, 10:33 AM IST