తెలంగాణ

telangana

ETV Bharat / state

బయోడైవర్సిటీ పైవంతెనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్​ బయోడైవర్సిటీ జంక్షన్​లో ఫస్ట్​లెవల్​ పైవంతెనను మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం, రాయదుర్గం వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్​ నుంచి కొంత ఉపశమనం కలగనుంది.

the-first-level-project-at-biodiversity-junction-opening-by-minister-ktr-in-hyderabad
బయోడైవర్సిటీ పైవంతెనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

By

Published : May 21, 2020, 11:46 AM IST

Updated : May 21, 2020, 12:10 PM IST

హైదరాబాద్ బయోడైవర్సిటీ కూడలిలో నిర్మించిన మెదటి లేవల్ పైవంతనను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ , ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కేటీఆర్​ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేశారు. 690 మీటర్ల పొడవు, 11.50 మీటర్ల వెడల్పు గల పైవంతెనను....30 కోట్ల 26లక్షల వ్యయంతో నిర్మించారు.

ప్రస్తుతానికి ఫ్లైఓవర్ పై ఒకే వైపు వాహనాలకు అనుమతించనున్నట్లు తెలిపిన మేయర్ బొంతు రామ్మోహన్ ఈ మార్గం ద్వారా గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోతాయని పేర్కొన్నారు

బయోడైవర్సిటీ పైవంతెనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఇదీ చూడండి:పెట్రోల్​ బంక్​ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు

Last Updated : May 21, 2020, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details