తొలి దఫా ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కన్వీనర్ కోటాలో 65 వేల 444 సీట్లు ఉండగా 49 వేల 12 సీట్లు భర్తీ అయ్యాయి. ఎంపీసీ కోటా బీఫార్మసీలో 3 వేల 280 సీట్లు ఉండగా 87 సీట్లు, ఫార్మ్డీలో 535 సీట్లుండగా 30 సీట్ల కేటాయింపు పూర్తయింది. మొదటి విడత కౌన్సెలింగ్ తర్వాత ఇంజినీరింగ్లో 16 వేల 432 సీట్లు, బీ ఫార్మసీలో 3 వేల 193, ఫార్మ్డీలో 505 సీట్లు మిగిలాయి.
13 కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ
విశ్వవిద్యాలయాల కళాశాలలకు ఈ ఏడాది కూడా విద్యార్థుల నుంచి డిమాండ్ కనిపించింది. రాష్ట్రంలో 14 యూనివర్సిటీ కాలేజీలు ఉండగా వాటిలో 99.93 శాతం సీట్లు నిండిపోయాయి. మొత్తం 13 కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ కాగా... మరో కాలేజీలో కేవలం రెండు సీట్లు మాత్రమే మిగిలాయి. రాష్ట్రవ్యాప్తంగా 36 ప్రైవేట్ కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 38 కోర్సులు ఉండగా... వాటిలో 25 కోర్సుల్లో సీట్లన్నీ నిండిపోయాయి.