హైదరాబాద్ బషీర్బాగ్లోని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ జోనల్ కార్యాలయాన్ని పౌల్ట్రీ రైతులు ముట్టడించారు. ట్రేడర్లు, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ధరలను నిర్ణయిస్తూ లేయర్ రైతులకు మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారని వాగ్వావాదానికి దిగారు. ఒక్కో గుడ్డుకు 4 రూపాయల వ్యయం అవుతుందని... కానీ ట్రేడర్లు తమకు రూ.3.90 పైసలు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల మనుగడ సాగాలంటే కనీసం ఒక్కో గుడ్డుకు 4రూపాయల 50 పైసలు మద్దతు ధర చెల్లించాలని వారు కోరారు.
కోడి గుడ్డుకు మద్దతు ధర చెల్లించాలి - foultry formers
కోడి గుడ్డుకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బషీర్ బాగ్లోని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ జోనల్ కార్యాలయాన్ని పౌల్ట్రీ రైతులు ముట్టడించారు. ఒక్కో గుడ్డుకు 4రూపాయల 50 పైసలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ఆందోళన చేస్తున్న రైతులు