తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రికెట్​లో వాగ్వాదం... బాలుడు మృతి - boy dead

చిన్న విషయంతో తలెత్తిన వివాదం ఓ చిన్నారి ప్రాణం తీసింది. స్నేహితుడు క్రికెట్​ బ్యాట్​తో దాడి చేయటం వల్ల 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.

crime

By

Published : Aug 14, 2019, 11:30 AM IST

క్రికెట్​లో వాగ్వాదం... బాలుడు మృతి

క్రికెట్​ ఆడుతుండగా తలెత్తిన వివాదం ఓ బాలుడి ప్రాణం తీసింది. తోటి స్నేహితుడు క్రికెట్ ​బ్యాట్​తో దాడి చేయటం వల్ల 13 ఏళ్ల బాలుడు మరణించాడు. ఈ విషాదకర ఘటన విశాఖలో చోటుచేసుకుంది. నగరంలోని కరాస ప్రాంతానికి చెందిన విజయ్(13) అతని స్నేహితుడు(14) ఆదివారం క్రికెట్ ఆడుతుండగా వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటికే విజయ్ రెండు మ్యాచ్​లు గెలిచి, మరో మ్యాచ్​లో విజయానికి సిద్ధంగా ఉన్నాడు. దీన్ని ఓర్చుకోలేని తోటి బాలుడు కోపంతో విజయ్​పై దాడి చేశాడు. క్రికెట్​ బ్యాట్​తో పొట్టలో పొడిచాడు. లోపలి పేగుల్లో రక్తప్రసరణ నిలిచిపోయి విజయ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడిని.. కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి విజయ్ ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details