CONGRESS DHARNA: రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నేడు కాంగ్రెస్ పార్టీ ధర్నాలకు దిగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్పీ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టనుంది. హిమంత బిశ్వశర్మ అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్.. హిమంతపై క్రిమినల్ కేసులు నమోదు చేయనందుకు నిరసనగా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
CONGRESS DHARNA: నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టనున్న కాంగ్రెస్ - Congress party latest news
CONGRESS DHARNA: కాంగ్రెస్ పార్టీ నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు దిగనుంది. రాహుల్ గాంధీపై అసోం సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు చేపట్టనుంది. ఈ నిరసన కార్యక్రమాల్లో పలువురు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా హిమంత బిశ్వశర్మ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని.. హిమంత బిశ్వశర్మపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇదిలా ఉండగా.. నేటి ధర్నాలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధర్నాలో పాల్గొంటారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ వద్ద భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధర్నాలో పాల్గొంటారు.
ఇదీ చూడండి: కోమటిరెడ్డితో రేవంత్‌రెడ్డి మొదటిసారి భేటీ.. ఆ విషయాలపై చర్చ