ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన కాంగ్రెస్... స్వేచ్ఛ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. 1975 జూన్ 25న ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని బ్లాక్‌డేగా పాటించాలని పిలుపునిచ్చిన భాజపా... రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యనేతలు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మురళీధర్‌రావు... హైదరాబాద్ జిల్లా నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆనాటి పరిస్థితులను గురించి చర్చించారు.
భాజపా ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం సజీవం: మురళీధర్ రావు - తెలంగాణ భాజపా తాజా వార్తలు
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్... స్వేచ్ఛ గురించి మాట్లాడుతోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఎద్దేవా చేశారు. జూమ్ యాప్ ద్వారా భాజపా నాయకులు, ముఖ్యకార్యకర్తలతో ఆయన మాట్లాడారు.
ప్రజా స్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూని చేసింది: మురళీధర్ రావు
భాజపా తప్ప మిగతావన్నీ కుల, కుటుంబ పార్టీలేనని విమర్శించారు. భాజపా ఉన్నన్ని రోజులు ప్రజాస్వామ్యానికి డోకా లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యతిరేకతను, అవినీతిని, కుటుంబ రాజకీయాలను పెంచిపోషిస్తోందని దుయ్యబట్టారు. మోదీ నాయకత్వంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని కొనియాడారు.
ఇవీ చూడండి:నేటి నుంచి గోల్కొండ కోటలో ఆషాఢమాస బోనాలు